MAHA SAMPROKSHANAM IN CHANDRAGIRI RAMALAYAM_ అక్టోబరు 23 నుండి 25వ తేదీ వరకు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహా సంప్రోక్షణ
Tirupati, 22 Oct. 19: The religious ritual of Maha Samprokshanam will be observed from October 23 to 25 in Sri Kodanda Ramalayam at Chandragiri.
On first day Vishwaksena Aradhana, Punyahavachanam, Ankurarpana, Balalaya Jeernodharana will be performed. While on second day, Kalapakarshana, Sayanadhivasam, Jaladhivasam will be performed.
On the last day, Maha Shanti Homam, Maha Shanti Abhishekam and Maha Purnahuti will be performed.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అక్టోబరు 23 నుండి 25వ తేదీ వరకు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహా సంప్రోక్షణ
తిరుపతి, 2019 అక్టోబరు 22: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 23 నుండి 25వ తేదీ వరకు బాలాలయ జీర్ణోద్ధరణ, మహా సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అక్టోబరు 23వ తేదీ సాయంత్రం వాస్తుపూజ, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణంతో బాలాలయ జీర్ణోద్ధరణ ప్రారంభంకానుంది.
ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబరు 24వ తేదీ ఉ9దయం 7.30 నుండి 11.00 గంటల వరకు కలపకర్షణ, చతుష్టార్చన, శయ్యాధివాసం, జలధివాసం, సాయంత్రం 5.00 గంటలకు శయ్యాధి కర్మాంగ స్నపనం నిర్వహిస్తారు. అక్టోబరు 25వ తేదీ ఉదయం 8.00 నుండి 10.30 గంటల వరకు ద్వారా పూజ, మహా శాంతి హోమం, మహా శాంతి అభిషేకం, పూర్ణాహుతి, మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.