SRIVARI SARVA DARSHAN TOKENS FROM OCTOBER 26 _ అక్టోబరు 26 నుండి తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ
Tirumala, 25 Oct. 20: TTD is all set to issue 3000 free tokens per day for Srivari sarva darshan from October 26, Monday onwards at the counters in Bhudevi Complex near Alipiri.
These tickets will be issued one day in advance from 5am onwards on first come first serve basis till the tokens quota lasts.
In view of Covid-19 guidelines, only devotees with darshan tokens alone would be allowed at the Alipiri check point to go to Tirumala either on foot or by transport.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అక్టోబరు 26 నుండి తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ
తిరుమల, 25 అక్టోబరు 2020: శ్రీవారి దర్శనార్థం ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను అక్టోబరు 26వ తేదీ సోమవారం నుండి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో గల కౌంటర్లలో జారీ చేస్తారు. రోజుకు 3 వేల చొప్పున టోకెన్లను ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి భక్తులకు అందిస్తారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు జారీ చేస్తారు.
శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒక రోజు ముందు టోకెన్లు ఇస్తారు. టోకెన్లు పొందిన భక్తులు మరుసటి రోజు దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.
దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి తిరుమలకు అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరడమైనది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.