NAVARATRI FETE OF TIRUCHANOOR TEMPLE FROM OCTOBER 2 -12 _ అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

Tirupati, 02 October 2024: TTD is organising nine-day festivities of Navaratri at Sri Padmavati temple at Tiruchanoor from October 3-12 with the prestigious Gaja Vahana Seva on October 12  to bless Her devotees.

As part of colourful celebrations, TTD will conduct  Snapana Tirumanjanam in the morning and Unjal Seva festivities in the evenings on all these nine days.

Arjita Sevas cancelled 

In view of day long activities and festivities, TTD has cancelled all arjita Sevas like Kalyanotsavam during these 10 days and Lakshmi puja on October 4 &11 and Unjal Seva on October 12.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

తిరుపతి, 2024 అక్టోబరు 02: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా రాత్రి 7 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 12వ తేదీ విజయదశమినాడు రాత్రి 7:45 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

న‌వ‌రాత్రి ఉత్స‌వాల కార‌ణంగా ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం సేవను ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది. అదేవిధంగా, అక్టోబరు 4, 11వ తేదీలలో ల‌క్ష్మీపూజ‌, అక్టోబరు 12న ఊంజల సేవలను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.