KOIL ALWAR IN SRI GT _ అక్టోబరు 30న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం
TIRUPATI, 23 OCTOBER 2024: The Koil Alwar Tirumanjanam in connection with Deepavali Asthanam in Sri Govindaraja Swamy temple will be observed on October 24.
On October 30, Deepavali Asthanam will be observed from 4pm and 5:30pm. As a part of it Diyas will be lit at different sub temples in the temple complex.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అక్టోబరు 30న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం
– అక్టోబరు 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2024 అక్టోబరు 23: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరు 30వ తేదీ దీపావళి సందర్భంగా సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు ఆస్థానం వైభవంగా జరుగనుంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
దీపావళి ఆస్థానం సందర్భంగా ఆలయంలో అక్టోబరు 24వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.