SRI VARI QUARTERLY “METLOTSAVAM” ON OCTOBER 31 _ అక్టోబ‌రు 31న‌ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

Tirupati, 26 October  2025: Under the aegis of the TTD run Dasa Sahitya Project, the Sri Vari Traimasika Metlotsavam will be conducted at Alipiri Padala Mandapam on October 31. 

The celebrations will be observed from October 30 to November 1 at the Asthana Mandapam in Tirumala.

As part of the programme, Metla Pooja (worship of the holy Alipiri steps) will be performed at 4:30 a.m. on October 31. Following this, thousands of members from various Bhajana Mandalis will ascend the holy hills of Tirumala with devotional singing and chanting.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 31న‌ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుప‌తి, 2025 అక్టోబ‌రు 26: టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబ‌రు 31వ‌ తేదీ తిరుప‌తి అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద  శ్రీవారి త్రైమాసిక  మెట్లోత్సవం ఘనంగా  జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మం అక్టోబ‌రు 30 నుండి న‌వంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌ ఆస్థాన మండపంలో  ఘ‌నంగా నిర్వహించనున్నారు.

అక్టోబ‌రు 31వ‌ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వ‌ద్ద‌ మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.

ఇందులో భాగంగా   అక్టోబ‌రు 30వ‌ తేదీ తిరుమ‌ల ఆస్థాన మండ‌పంలో మ‌ధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు భజన మండళ్లతో నామ సంకీర్త‌న‌, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, మహనీయులు మాన‌వాళికి అందించిన ఉప‌దేశాలు తెలియ‌జేస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అక్టోబ‌రు 31న మ‌ధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ధార్మిక సందేశాలు, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు.

న‌వంబ‌రు 1న ఉద‌యం 8.30 గంట‌ల‌కు సామూహిక నామ సంకీర్త‌న‌, ఉద‌యం 9.30 గంట‌ల నుండి  స్వామిజీలు ధార్మిక సందేశ‌ము ఇవ్వ‌నున్నారు.    

పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.