NAVARATRI FETE IN KT _ అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
TIRUPATI, 27 SEPTEMBER 2024: TTD has made elaborate arrangements for organising grand Navaratri celebrations at Sri Kapileswara Swamy temple from October 4-12 with Koil Alwar Tirumanjanam on September 29.
As part of the festivities, Goddess Kamakshi will appear in different alankaram everyday from October 4 onwards.
On the occasion of Navratri celebrations, after appearing as Kamakshi on the first day, She will appear as Sri Adiparashakti on October 5, Sri Mahalakshmi on October 6, Mavadi Seva on October 7, Sri Annapurna Devi on 8, Durga Devi on 9, Shri Mahishasura Mardini on October 10, Sri Saraswati Devi, on October 11 and on October 12 in Sri Siva Parvatula Alankaram.
On the last day of October 12, the Parveta Utsavam will also be held in the premises of Sri Abhayahasta Anjaneyaswamy Temple at 6 pm.
The artists of TTD HDPP and Annamacharya Project will present devotional music, Puran Pravachanam, Devi Bhagavatam and Lalitasahasranama recitation programs.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
తిరుపతి, 2024 సెప్టెంబరు 27: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 29న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్టోబరు 4న శ్రీ కామాక్షి దేవి, అక్టోబరు 5న శ్రీ ఆదిపరాశక్తి, అక్టోబరు 6న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, అక్టోబరు 7న మావడి సేవ, అక్టోబరు 8న శ్రీఅన్నపూర్ణాదేవి, అక్టోబరు 9న శ్రీ దుర్గాదేవి, అక్టోబరు 10న శ్రీ మహిషాసురమర్థిని, అక్టోబరు 11న శ్రీ సరస్వతి దేవి, అక్టోబరు 12న శ్రీ శివపార్వతుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 12న చివరిరోజు శ్రీ అభయహస్త ఆంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.