అక్టోబర్ 10 నుండి 12వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
అక్టోబర్ 10 నుండి 12వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2023 సెప్టెంబరు 30: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబర్ 10 నుండి 12వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం అక్టోబర్ 9న సాయంత్రం అంకురార్పణ జరుగనుంది.
యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన అక్టోబర్ 10న పవిత్ర ప్రతిష్ఠ, అక్టోబర్ 11న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు. చివరిరోజు అక్టోబర్ 12న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన జరుగనుంది. పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.