PAVITHROTSAVAMS AT JUBILEE HILLS SRI VENKATESWARA SWAMY TEMPLE FROM OCTOBER 17 TO 19 _ అక్టోబర్ 17 నుండి 19వ తేదీ వ‌ర‌కు జూబ్లీహిల్స్ శ్రీ ఎస్వీ ఆలయంలో పవిత్రోత్సవాలు

Tirupati / Hyderabad, 13 October 2025: The annual Pavithrotsavams will be conducted at the Sri Venkateswara Swamy Temple, Jubilee Hills, Hyderabad, from October 17 to 19, as per Agama traditions. 

The rituals will commence with Ankurarpanam on the evening of October 16.

Pavithrotsavam is a traditional purification ceremony performed to ward off any spiritual or ritual errors that may have occurred inadvertently during the year either by the devotees or temple staff.

As part of the program, Pavitra Pratishta will be conducted on October 17, Pavitra Samarpana and Pavitra Homams on October 18, and the Maha Purnahuti and Pavitra Visarjana will be performed on October 19.

On all three days, Snapana Tirumanjanam (holy bath ceremony) will be conducted to the utsava murthies of Sri Prasanna Venkateswara Swamy along with Sridevi and Bhudevi in the morning.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

అక్టోబర్ 17 నుండి 19 తేదీ వ‌ర‌కు జూబ్లీహిల్స్ శ్రీ ఎస్వీ ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి/ హైదరాబాద్, 2025, అక్టోబర్ 13: హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అక్టోబర్ 17 నుండి 19వ తేదీ వ‌ర‌కు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకోసం అక్టోబర్ 16న సాయంత్రం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది.

యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన అక్టోబర్ 17న‌ పవిత్ర ప్రతిష్ఠ, అక్టోబర్ 18న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు. చివరిరోజు అక్టోబర్ 19న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన జ‌రుగ‌నుంది. ప‌విత్రోత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.