అక్టోబర్ 24న తిరుపతిలో ఏఇఇ పోస్టులకు వ్రాత పరీక్ష
అక్టోబర్ 24న తిరుపతిలో ఏఇఇ పోస్టులకు వ్రాత పరీక్ష
తిరుపతి, 2010 అక్టోబర్ 23: తితిదేలో 16 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకుగాను తిరుపతిలో అక్టోబర్ 24వ తేదిన వ్రాత పరీక్ష నిర్వహిస్తారు.
ఈ వ్రాత పరీక్షకుగాను 2054 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వ్రాత పరీక్ష తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, శ్రీపద్మావతి జూనియర్ కళాశాలలో ఉదయం 10.30 నుండి 1.30 వరకు నిర్వహిస్తారు.
వ్రాత పరీక్ష 40% అబ్డెక్టివ్, 60% సబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. వ్రాత పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.