అక్టోబ‌రు 17 నుండి 26వ తేదీ వ‌ర‌కు తుమ్మూరులోని శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆల‌యంలో న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

అక్టోబ‌రు 17 నుండి 26వ తేదీ వ‌ర‌కు తుమ్మూరులోని శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆల‌యంలో న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

తిరుపతి, 2020 అక్టోబ‌రు 15: శ్రీ‌పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా, నాయుడుపేట మండలం, తుమ్మూరు గ్రామంలోని శ్రీ క‌రియ‌మాణిక్య‌స్వామి, శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆల‌యంలో అక్టోబ‌రు 17 నుండి 26వ తేదీ వ‌ర‌కు దేవి న‌వ‌రాత్రి ఉత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు.
 
 ఇందులో భాగంగా అక్టోబ‌రు 17న శ్రీ పార్వ‌తిదేవి , అక్టోబ‌రు 18న  శ్రీ బాలా త్రిపుర‌సుంద‌రి, అక్టోబ‌రు 19న శ్రీ ల‌లితా త్రిపుర‌సుంద‌రి,  అక్టోబ‌రు 20న శ్రీ‌మ‌హాల‌క్ష్మి, అక్టోబ‌రు 21న శ్రీ అన్న‌పూర్ణా దేవి, అక్టోబ‌రు 22న శ్రీ గాయ‌త్రిదేవి, అక్టోబ‌రు 23న శ్రీ స‌ర‌స్వ‌తిదేవి, అక్టోబ‌రు 24న శ్రీ దుర్గాదేవి, అక్టోబ‌రు 25న శ్రీ మ‌హిషాసురమ‌ర్ధిని, అక్టోబ‌రు 26న శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అలంకారాల్లో అమ్మ‌వారు ద‌ర్శ‌న‌మిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.