అట్టహాసంగా ప్రారంభమైన టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు
అట్టహాసంగా ప్రారంభమైన టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు
తిరుపతి, 2022 ఫిబ్రవరి 09: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉద్యోగుల సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ దామోదరం టిటిడి పరిపాలన భవనం ఆవరణలోని పరేడ్ మైదానంలో టగ్ ఆఫ్ వార్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ దామోదరం మాట్లాడుతూ క్రీడలు ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలేనని, గెలుపు ఓటములతో పనిలేకుండా ఆటల పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అనంతరం రిక్రియేషన్ హాల్లో క్యారమ్స్ పోటీలు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో లాంగ్ టెన్నిస్ పోటీలు ప్రారంభించారు. ఉద్యోగుల సహకార బ్యాంకు డైరెక్టర్ శ్రీ జానకి రామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోటీలు ఈ నెల 23వ తేదీ వరకు జరుగనున్నాయి.
మొదటి రోజు క్రీడాపోటీల విజేతలు
– 45 ఏళ్ల లోపు మహిళా ఉద్యోగుల టగ్ ఆఫ్ వార్ పోటీల్లో శ్రీమతి ఎస్.ద్రాక్షాయణి జట్టు విజయం సాధించగా, శ్రీమతి ఎన్.పద్మజ జట్టు రన్నరప్ గా నిలిచింది.
– 45 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగుల టగ్ ఆఫ్ వార్ పోటీల్లో శ్రీమతి వి.శాంతి జట్టు విజయం సాధించగా, శ్రీమతి ఎం.శోభారాణి జట్టు రన్నరప్ గా నిలిచింది.
– 45 ఏళ్లు పైబడిన ఉద్యోగుల క్యారమ్స్ సింగిల్స్ పోటీల్లో శ్రీ జిఎన్.వేణుగోపాల్ విజయం సాధించగా, శ్రీ బి.మురళి రన్నరప్ గా నిలిచారు.
– 45 ఏళ్లు పైబడిన ఉద్యోగుల క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో
శ్రీ బి.మురళి, శ్రీ ఎం.రాజేంద్రకుమార్ జట్టు విజయం సాధించగా, శ్రీ జిఎన్.వేణుగోపాల్, శ్రీ ఎన్.చంద్రశేఖర్ జట్టు రన్నరప్ గా నిలిచింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.