SOMASKANDA RIDES ADHIKARA NANDI _ అధికార నంది వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి అభ‌యం

Tirupati, 18 Feb. 20: On the fifth day of the ongoing annual Brahmotsavams of Sri Kapileswara swami in Tirupati, Lord Sri Somaskanda murthy blessed His devotees on Adikara Nandi Vahanam on Tuesday evening.

The ensemble of elephants, bulls and bhajan mandals and cultural teams heightened the glory and gaiety of the procession as devoees offered haratis all along .

Adhikara Nandi also known as Kailasa Nandi which is the regular vehicle of Sri Kapileswara Swamy and darshan is considered sacred.

DyEO Sri Subramanyam,  Superintendent Sri Bhupathi Raju, AVSO Sri Surendra, temple inspectors Sri Reddy Sekhar and Sri Srinivas Naik and others participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

అధికార నంది వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి అభ‌యం

తిరుప‌తి, 2020 ఫిబ్ర‌వ‌రి 18: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు అధికార నంది వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. గజాలు, వృషభాలు ముందు వెళుతుండగా, కళాబృందాల కోలాటాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

శ్రీ కపిలేశ్వరస్వామి వాహనసేవలలో విశిష్ఠమైనది అధికారనంది. ఈ అధికారనందికి నామాంతరం కైలాసనంది. కైలాసంలో మెడలో మువ్వలదండలతో, కాళ్లకు గజ్జెలతో మనోహరాకారంతో, బంగారుకొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్యవాహనం.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తిరాజు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.