SOMASKANDA ON ADHIKARA NANDI _ అధికార నంది వాహనంపై సోమస్కందమూర్తి
Tirupati, 8 Mar. 21: Somaskandamurty blessed devotees on Adhikara Nandi Vahana held in Ekantam on Monday evening.
This event took place as part of ongoing annual brahmotsavams in Kapilatheertham at Tirupati.
Temple DyEO Sri Subramanyam and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అధికార నంది వాహనంపై సోమస్కందమూర్తి
తిరుపతి, 2021 మార్చి 08: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన సోమవారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి అధికార నంది వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
శ్రీ కపిలేశ్వరస్వామి వాహనసేవలలో విశిష్ఠమైనది అధికారనంది. ఈ అధికారనందికి నామాంతరం కైలాసనంది. కైలాసంలో మెడలో మువ్వలదండలతో, కాళ్లకు గజ్జెలతో మనోహరాకారంతో, బంగారుకొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్యవాహనం.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖర్, శ్రీ శ్రీనివాస్‌నాయక్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.