FROM TIME IMMEMORIAL SRIVARI LADDUS MADE BY SRI VAISHNAVA BRAHMINS ONLY – TTD _ అనాదిగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు చే తయారీ- లడ్డూ తయారీపై ఎటువంటి అపోహలొద్దు: టీటీడీ

APPEALS TO DEVOTEES NOT TO BELIEVE RUMOURS

Tirumala, 17 July 2024: TTD on Wednesday clarified that the most sacred Srivari Laddu Prasadam are being prepared only by Sri Vaishnava Brahmins since several centuries and appealed to the devotees not to be carried away by false news.

In a statement on Wednesday, the TTD said that legal action will be taken against those who spread false propaganda about Srivari laddus on social media platforms.

In Laddu Potu (kitchen ) as many as 980 Hindus are working at present and are performing the pious duties assigned to them since time immemorial.

Among them, Sri Vaishnava Brahmins are being engaged in collecting the raw materials used to prepare Laddus and they alone make laddus. While others are engaged in the transportation of laddus, storage, cleaning activity of Potu, and various other duties in laddu counters.

TTD said false propaganda is being spread on the social media platform that Srivari Laddu Prasadas are being prepared under the direction of a contractor named Sri. Thomas which is absolutely false and baseless.

TTD appeals to the devotees not to believe such fake propaganda coming in some social media outlets.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అనాదిగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు చే తయారీ

– లడ్డూ తయారీపై ఎటువంటి అపోహలొద్దు: టీటీడీ

తిరుమల‌, 2024 జూలై 17: తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఎన్నో దశాబ్దాల నుండి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయానుసారంగా తయారు చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు బుధవారం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

తిరుమల శ్రీవారి పోటులో 980 మంది హిందూ మతానికి చెందిన పోటు కార్మికులు తమకు నిర్దేశించిన వివిధ విధులను నిర్వహిస్తున్నారు.

వీరిలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ, ముడి సరుకులు తీసుకురావడం వంటి పనులు చేస్తారు. ఇతరలు, లడ్డూలను తరలించడం, ఉగ్రాణం, పడి పోటు, లడ్డు కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్నారు.

ఇటీవల సోషల్ మీడియా వేదికగా శ్రీవారి లడ్డు ప్రసాదాలను శ్రీ థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

కొన్ని సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఇలాంటి అసత్య వార్తలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.