”అన్నదానం విరాళంపై సమాధానం లేదు” అని ప్రచురించిన వార్త వాస్తవ దూరం.

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
వివరణ (తిరుపతి, మార్చి-24, 2011)
”అన్నదానం విరాళంపై సమాధానం లేదు” అని ప్రచురించిన వార్త వాస్తవ దూరం.

              మార్చి 24వ తేదిన ”సాక్షి” దినపత్రిక నందు ప్రచురించిన ”అన్నదానం విరాళంపై సమాధానం లేదు” అని ప్రచురించిన వార్త వాస్తవ దూరం.
దాత అమర్‌జైన్‌ అందజేసిన లక్ష రూపాయల విరాళంకు రసీదు, ఇన్‌కంటాక్స్‌ మినహాయింపు పత్రం సర్టిఫికెట్‌ ఆఫ్‌ పోస్టు ద్వారా తేది:12-04-2010న దాతకు పంపడమైనది మరియు పాస్‌పుస్తకము తయారు చేయడానికి అవసరమైన ఫోటోలు, ఇతర వివరాలు పంపమని దాతను తి.తి.దే. వారు కోరినారు. వివరాలు దాత నుండి ఇంకారావలసి వుంది. వచ్చిన వెంటనే పాస్‌పుస్తకం కూడా దాతకు పంపడం జరుగుతుంది.
           తితిదే అన్నదానం నిధికి అందుతున్న విరాళాలకు దాతలకు ఇవ్వలసినవి ఎప్పటికప్పుడు అందజేయడం జరుగుతూ వుంది. అందువలనే ఎక్కువ విరాళాలు ఈ ట్రస్ట్‌కు సమకూరాయి. అన్నదానం విభాగపు సేవలపై దాతలు తమ సంతృప్తిని తెలిజేస్తున్నారు.
కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రికలో వివరణగా ప్రచురించాల్సిందిగా కోరుచున్నాము.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి