ADDITIONAL EO SURPRISE INSPECTION AT MTVAC _ అన్నప్రసాద కేంద్రంలో అడిషనల్ ఈఓ ఆకస్మిక తనిఖీలు

TIRUMALA, 22 OCTOBER 2024: TTD Additional EO sri Ch.Venkaiah Chowdary conducted a surprise inspection at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC)in Tirumala on Tuesday evening. 

On this occasion, he enquired the devotees about the taste and quality of the menus served in Annaprasadam.

Afterwards, he had a community dining with the devotees. 

The devotees expressed their happiness about the enhanced taste and quality of the Annaprasadam.

Deputy EO Sri Rajendra, Special Catering Officer Sri GLN  Shastry and others were present. 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నప్రసాద కేంద్రంలో అడిషనల్ ఈఓ ఆకస్మిక తనిఖీలు

తిరుమల, 2024 అక్టోబ‌రు 22: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో టీటీడీ అడిషనల్ ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోజనం రుచి, నాణ్యత గురించి భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు‌.

అనంతరం భక్తులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యత చాలా బాగుందని భక్తులు అడిషనల్ ఈఓ వద్ద ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ శ్రీ రాజేంద్ర, స్పెషల్ క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.