ANNAMAIAH SANKEERTANS WEED OUT EVIL IDEAS IN HUMANS-CHAGANTI _ అన్నమయ్య కీర్తనలు మనుషుల్లోని రాక్షస భావాలను తొలగిస్తాయి – తాళ్ళపాక సంకీర్తనలు పుస్తకావిష్కరణ సభలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Tirupati, 7 Jan. 22: The essence of Annamaiah Sankeertans have the power to weed out ill and evil ideas from all of us and lead a righteous life said renowned scholar Brahmasri Chaganti Koteswara Rao.

During the book release of Annamacharya Sankeertans held at Mahati Auditorium on Friday evening, the versatile spiritual speaker said the Sankeertans will provide a soothing and healing touch to the depressed souls. He appreciated the efforts of Sri Shankara Murty and Padmabhushan Sri Varaprasad Reddy in brining out the Sankeertans in the form of a book. He thanked TTD for publishing them with an aim to give the knowledge embedded in it to the public.

EO Dr KS Jawahar Reddy said after two decades TTD has published 289 new Sankeertans of Annamacharya. He lauded the efforts of Sri Basava Sankara Murty and Sri Varaprasad Reddy behind the mission. To encourage youth in learning the songs we have organized the Adivo Alladivo programme and motivated new talents. He also said Tarigonda Vengamamba Dhyana Mandiram is also underway in Tirumala.

SVBC Chairman Dr Saikrishna Yachendra said Annamaiah had penned several Sankeertans believing Srivaru as Venkata Krishna.

Shanta Bio-tech Chief Padmabhushan Sri Varaprasad Reddy said Bhagavat Nama is the best way to attain salvation in Kaliyuga and it is the reason to bring the book and TTD published it for a wider reach in public.

Additional EO Sri AV Dharma Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, TTD Astana Gayaka Dr Balakrishna Prasad, Annamacharya Project Director Dr A Vibhishana Sharma and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నమయ్య కీర్తనలు మనుషుల్లోని రాక్షస భావాలను తొలగిస్తాయి

– తాళ్ళపాక సంకీర్తనలు పుస్తకావిష్కరణ సభలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

తిరుపతి 7 జనవరి 2022: మనుషుల్లోని రాక్షస భావాలను తొలగించడానికి భగవంతుడు భక్తి సంగీత ప్రభోదం కోసం అన్నమాచార్యుల లాంటి వారి రూపంలో భూమి మీదకు వచ్చారని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. అన్నమయ్య కీర్తనల్లోని సారాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే మనిషి జీవితం సార్థకం అవుతుందన్నారు.

తిరుపతి మహతి కళాక్షేత్రంలో శుక్రవారం ఆయన తాళ్ళపాక సంకీర్తనలు పుస్తకావిష్కరణ చేశారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శాంత వసంత ట్రస్ట్ సహకారంతో ఈ పుస్తకాన్ని ముద్రించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ, అన్నమయ్య సంకీర్తనలు మనసుకు ఊరట కల్పిస్తాయన్నారు. ఈ కీర్తనలు అన్ని స్థాయిలవారికి అనురక్తిని కల్పిస్తాయని ఆయన చెప్పారు. ఈ కీర్తనలు పరిశోధన వైపు నడిస్తే అదే విజ్ఞానం అవుతుందని, భగవంతుని పాదాలు విడిచి పెట్టకుండా ఉండే మార్గంగా మారుతుందన్నారు. అన్నమయ్య భగవత్ అంశ అని ఆయన తెలిపారు. రాతప్రతుల్లో ఉన్న ఈ కీర్తనలను వెలుగులోకి తేవడానికి కృషి చేసిన శ్రీ శంకర్ రావు, ప్రోత్సహించిన పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి అభినందనీయులన్నారు. ఈ కీర్తనలను రాజముద్ర వేసి, ఉద్యమ స్పూర్తితో ప్రచురణకు పూనుకున్న టీటీడీ ని అభినందించారు. ఈ కీర్తనలు పెద్ద ఎత్తున జనబాహుళ్యంలో కి వెళ్లి ప్రజలు తరించాలని శ్రీ కోటేశ్వరరావు అభిలషించారు.

టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, 20 సంవత్సరాల తరువాత టీటీడీ అన్నమయ్య రాతప్రతుల్లోని 289 కీర్తనలను ముద్రించిందన్నారు. శ్రీ వరప్రసాద్ రెడ్డి, బసవ శంకర మూర్తి ఇందుకు సహకరించారని తెలిపారు. అన్నమయ్య రచించిన 32 వేల సంకీర్తనల్లో 14 వేలు లభించాయని, ఇందులో 4 వేల సంకీర్తనలను టీటీడీ స్వరబద్ధం చేసిందని చెప్పారు. వీటిలో 100 దాకా సంకీర్తనలు మాత్రమే పెద్ద ఎత్తున జనబాహుళ్యంలోకి వెళ్లాయని ఆయన చెప్పారు. మిగిలిన వాటిని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి 4 వేల సంకీర్తనలపై యువతీయువకులకు గాన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంకీర్తనకు అందరికే అర్ధమయ్యే సరళమైన తెలుగు లో భావం, అర్థం ప్రచురించే ప్రక్రియకు టీటీడీ శ్రీకారం చుట్టిందన్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి చానళ్ల ద్వారా అన్నమయ్య సంకీర్తనలను దేశ వ్యాప్తంగా ప్రసారం చేయాలని సంకల్పించామని ఈవో వివరించారు. దీంతో పాటు తిరుమల లో శ్రీవారి భక్తురాలు తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిర నిర్మాణం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచెంద్ర మాట్లాడుతూ, మరుగున పడ్డ మరిన్ని అన్నమయ్య సంకీర్తనలు కాలగర్భంలో కలసిపోకుండా వెలుగులోకి తేవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. అన్నమయ్య శ్రీవారిని వెంకట కృషుడిగా భావించి అనేక సంకీర్తనలు రాశారని ఆయన చెప్పారు.

శాంత బయోటెక్ అధినేత పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కలియుగంలో కేశవ నామ సంకీర్తనతో పుణ్యం పొందుతామని అన్నారు. భగవత్ భక్తి మనిషిలోని భావ కాలుష్యాన్ని తొలగిస్తుందని ఆయన చెప్పారు. లభ్యం కాని అన్నమయ్య సంకీర్తనలు వెలుగులోకి తెచ్చి ప్రజా బాహుళ్యంలో ప్రతినోట పలికించాలనే ఉద్దేశంతోనే రాత ప్రతుల్లోని 289 కీర్తనలను పుస్తక రూపంలో తెచ్చామని చెప్పారు. వీటిని స్వరపరచి టీటీడీ ద్వారా ప్రజల్లోకి పంపుతామని ఆయన వెల్లడించారు.

అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో (విద్య మరియు వైద్యం) శ్రీమతి సదా భార్గవి, జెఈవో శ్రీ వీర బ్రహ్మం, టీటీడీ ఆస్థాన గాయకులు శ్రీ బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ విభీషణ శర్మ, అన్నమాచార్య రాత ప్రతుల పరిశోధకులు శ్రీ బసవ శంకర రావు పాల్గొన్నారు. శ్రీ వర ప్రసాద్ రెడ్డి వీరందరితో పాటు పుస్తక కమిటీ లోని సముద్రాల లక్ష్మణయ్య, ఆచార్య సర్వోత్తమ రావు, మోదుగుల రవికృష్ణ, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్, సినీ నేపథ్య గాయని శ్రీమతి ఎస్పీ శైలజ ను శాలువ తో సన్మానించి, మెమెంటో అందించారు.

ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి పద్మభూషణ్ వర ప్రసాద్ రెడ్డిని టీటీడీ తరపున సన్మానించారు.

ఎస్వీబీసీ న్యూస్ ఇంచార్జ్, శాంత వసంత ట్రస్ట్ సభ్యురాలు శ్రీమతి రామలక్ష్మి సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది