GODA KALYANAM HELD IN TIRUPATI _ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోదాకల్యాణం
Tirupati, 14 Jan. 22: The month-long Tiruppavai Pravachanam came to a religious end with Goda Kalyanam observed at Annamacharya Kalamandiram in Tirupati on Friday.
The deities of Sri Ranganatha Swamy and Goda Devi were seated on the platform and the Veda Parayanamdars recited the shlokas performing Goda Kalyanam.
The Tiruppavai Pasura Pravachanam by Dr C Ranganathan organised under the aegis of Alwar Divya Prabandha Project of TTD also concluded.
Programme Officer Sri L Vijayasaradhi, Project Co-ordinator Sri Purushottam, Program Assistant Smt Kokila and local devotees were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోదాకల్యాణం
ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు
తిరుపతి, 2022 జనవరి 14: పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 208 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు.
ముందుగా శ్రీ గోదాదేవి(ఆండాళ్), శ్రీరంగనాథస్వామివారి ఉత్సవర్లను వేదికపై కొలువుతీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు. వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గాత్రసంగీతం నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది.
అన్నమాచార్య కళామందిరంలో ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు
టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబరు 17 నుంచి దాదాపు నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై ప్రవచనాలు శుక్రవారం ముగిశాయి. తిరుపతికి చెందిన శ్రీ చక్రవర్తి రంగనాథన్ ఇక్కడ తిరుప్పావై ప్రవచనాలు వినిపించారు.
ఈ కార్యక్రమంలో ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజయసారథి, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.