ANNAMACHARYA FETE CONCLUDES _ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం
Tirupati, 29 March 2025: On the occasion of the 522nd Vardhanti fete of Saint Poet Sri Tallapaka Annamacharya Sri Govindaraja Swamy Asthanam was held on Saturday at Annamacharya Kalamandiram.
It was a tradition that the Utsava deity of Sri Govindaraja visits Annamacharya Kalamandiram where the Annamacharya Project artistes render Sankeertans on Sri Govindaraja Swamy penned by the Saint Poet.
DyEO Smt Shanti, Annamacharya Project Director Sri Rajagopal Rao and others were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం
తిరుపతి, 2025 మార్చి 29: శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల 522వ వర్ధంతి మహోత్సవాల్లో చివరి రోజైన శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది.
భక్తుడి చెంతకు భగవంతుడు రావడం అనే ఆర్యోక్తికి తార్కానంగా శ్రీ వేంకటేశ్వరస్వామికి పరమభక్తుడైన అన్నమాచార్యుడు వెలసిన అన్నమాచార్య కళామందిరానికి శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవర్లు వేంచేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. అనంతరం గోవిందరాజస్వామివారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను ప్రాజెక్టు కళాకారులు సుమధురంగా ఆలపించారు.
అంతకుముందు ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయం నుండి ఊరేగింపుగా నాలుగు కాళ్ల మండపం, తీర్థకట్టవీధి మీదుగా అన్నమాచార్య కళామందిరానికి తీసుకొచ్చారు. ఆస్థానం అనంతరం తిరిగి ఉదయం 10 గంటలకు ఉత్సవమూర్తులను గోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ మతి శాంతి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ రాజగోపాలరావు, ఇతర అధికారులు, కళాకారులు, పురప్రజలు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.