PAVITROTSVAMS COMMENCES _ అప్ప‌లాయ‌గుంటలో శాస్త్రోక్తంగా ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం

TIRUPATI, 10 OCTOBER 2023: The annual Pavitrotsvams commenced on a  religious note in Appalayagunta on Tuesday.

In the morning Snapana Tirumanjanam was performed to the utsava deities.

Later in the evening Pavitra Pratishtha and other Vedic rituals were performed.

Temple AEO Sri Ramesh, Superintendent Smt Srivani, Temple Inspector Sri Siva Kumar, Kankanabhattar Sri Tippayacharyulu were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER

శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2023 అక్టోబరు 10: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ త‌రువాత‌ యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుక‌గా జరిగింది.  పాలు, పెరుగు, తేనె,  కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు.

 ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీ శ్రీవాణి, కంక‌ణ బ‌ట్ట‌ర్ శ్రీ తిప్పయాచార్యులు, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.