PAVITRA SAMARPANA HELD _ అప్ప‌లాయ‌గుంటలో శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ

TIRUPATI, 11 OCTOBER 2023: On the second day of the ongoing annual pavithrotsavam in Appalayagunta on Wednesday, Pavitra Samarpana was observed.

 

Temple AEO Sri Ramesh, Superintendent Smt Srivani, Kankanabhattar Sti Tippayacharyulu, Temple Inspector Sri Siva Kumar were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER



అప్ప‌లాయ‌గుంటలో శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ

తిరుప‌తి, 2023 అక్టోబ‌రు 11: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధ‌వారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన చేప‌ట్టారు. ఆ త‌రువాత‌ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుక‌గా జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

అనంత‌రం మూలవిరాట్‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి, శ్రీ ఆండాళ్ అమ్మవారికి, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వార్‌కు, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారికి, ధ్వ‌జ‌స్థంభం, ఇత‌ర ప‌రివార‌ దేవ‌త‌ల‌కు ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హించారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమ‌తి శ్రీవాణి, కంక‌ణబ‌ట్ట‌ర్ శ్రీ తిప్పయాచార్యులు, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.