MINI KALYANA KATTA OPENED _ అప్పలాయగుంటలో మినీ కల్యాణకట్ట ప్రారంభం
TIRUPATI, 07 OCTOBER 2021: A mini Kalyana Katta-tonsuring facility is opened at Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta on Thursday for the sake of devotees.
The officials of the temple opened the Kalyana Katta after offering pujas. This mini Kalyana Katta is located adjacent to Kalyana Mandapam. The devotees shall offer their hair as a part of the fulfilment of their wish akin to Tirumala temple. TTD has also constructed toilets and bathrooms for the sake of devotees who tonsure their heads.
Temple AEO Sri Prabhakar Reddy, Temple Inspector Sri Srinivasulu, temple archakas were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అప్పలాయగుంటలో మినీ కల్యాణకట్ట ప్రారంభం
తిరుపతి, 2021 అక్టోబరు 07: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం గురువారం మినీ కల్యాణకట్టను ఆలయ అధికారులు పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఆలయంలోని కల్యాణమండపం పక్కన మినీ కల్యాణ కట్టను ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు, తిరుమలకు వెళ్లే భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించేందుకు అనువుగా ఉంటుంది. తలనీలాలు సమర్పించే భక్తుల కోసం ఇక్కడ స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.