SACRED PAVITRA SAMARPANA PERFORMED AT SRI VENKATESWARA TEMPLE, AMARAVATI _ అమరావతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రసమర్పణ

Tirupati / Amaravati, August 20, 2025: At the Sri Venkateswara Swamy temple in Amaravati, the ritual of Pavitra Samarpana was performed with religious fervor on Wednesday.

The day began with Suprabhata Seva, followed by Tomala Seva, Sahasranamarchana, Koluvu and Panchanga Shravanam. Later, at the Yagashala, Punahavacahanam, Kumbha Aradhana and other principal Homas were performed.

As part of the festivities, Snapana Tirumanjanam was conducted with devotion to the Utsava Murthis of Sri Venkateswara Swamy along with Sri Devi and Bhu Devi. Later, the Pavitra Malas were consecrated and taken in procession before being offered to the presiding deity, Utsava Murthis, Vishvaksena, Dwarapalakas, Bhashyakaras, Garudalwar, Balipeetham, Dhwajastambham, and other Parivara Devatas.

In the evening, Vedic rituals, Maha Shanti Homam, and Tiruveedhi Utsavam are scheduled to take place.

Temple Superintendent Sri Mallikarjuna, Temple Inspectors Sri Ramakrishna and Sri Sandeep, priests, and a large number of devotees took part in the religious event.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

అమరావతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుపతి / అమరావతి, 2025 ఆగష్టు 20: అమరావతి (వేంకటపాలెం) శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స‌స్వామివారి ఆలయంలో బుధ‌వారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ  జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వహించారు. అనంత‌రం యాగ‌శాల‌లో పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు జ‌రిగాయి.

ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. మూల‌వ‌ర్త‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు, విష్వక్సేన, ద్వారపాలకులు, భాష్యకార్లు, గరుడాళ్వార్‌, బలిపీఠం ధ్వజస్తంభం, ప‌రివార దేవ‌త‌ల‌కు పవిత్రాలు సమర్పించారు.

సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో సూప‌రింటెండెంట్ శ్రీ మ‌ల్లికార్జున‌, టెంపుల్ ఇన్స్పెక్ట‌ర్లు శ్రీ రామ‌కృష్ణ‌, శ్రీ సందీప్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య‌ ప్రజా సంబందాల అధికారిచే విడుదల చేయబడినది.