SACRED ANKURARPANA FOR PAVITHROTSAVAMS AT AMARAVATHI HELD _ అమరావతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirupati / Amaravati, 18 August 2025: The sacred Ankurarpana ceremony was performed with religious fervour at the Sri Venkateswara Swamy Temple, Amaravati (Venkatapalem), the capital of Andhra Pradesh, on Monday evening, ahead of the three-day Pavithrotsavams scheduled from August 19 to 21.
For the first time, these rituals are being organized in the temple on a grand scale for the well-being of humanity.
As part of the Ankurarpana, Vishwaksena Aradhana, Punyahavachanam, Acharya-Ritwik Varanam, Senadhipati Utsavam, Mrutsangrahanam, and Ankurarpanam were conducted.
The program was attended by TTD Superintendent Sri M. Mallikarjuna, other staff and the priests.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
అమరావతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి / అమరావతి , 2025 ఆగష్టు 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి (వేంకటపాలెం) శ్రీ వేంకటేశ్వరసస్వామివారి ఆలయంలో ఆగస్టు 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. లోక కల్యాణార్థం మొదటిసారిగా ఆలయంలో పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా సాయంత్రం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విక్ వరణము, సేనాధిపతి ఉత్సవం, మృతస్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహించారు.
ఆగష్టు 19న ఉదయం పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట అధివాసం, సర్వదైవత్య హోమం చేపడుతారు.
ఆగష్టు 20న ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు, స్నపన తిరుమంజనం, పవిత్రాభిమంత్రణ, పవిత్ర సమర్పణము, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఆగష్టు 21వ తేదీన ఉదయం పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమములు, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, ఆచార్య, ఆగమ సలహాదారు, ఋత్విక్కులకు బహుమానం, యాజమాన ఆశీర్వాచనం చేపడుతారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సూపరింటెండెంట్ శ్రీ ఎం.మల్లికార్జున, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఏ.రామకృష్ఢ, శ్రీ ఎం.సందీప్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.



