ALIPIRI PADALA MANDAPAM TEMPLE BALALAYAM CONCLUDES WITH PURNAHUTI _ అలిపిరి పాదాల మండ‌పం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌శ్వ‌మివారి ఆలయంలో పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసిన‌ బాలాల‌యం

Tirumala, 03 March 2025: The Balalayam programs conducted for the last three days due to Ashtabandhan at Sri Venkateswara Swamy Temple at Alipiri Padala Mandapam and Sri Goda Ammavari Temple attached to Sri Lakshmi Narayana Swamy Temple in Tirupati concluded on Monday with Purnahuti. 

As a part of this, Yagashala Vedic programs, Purnahuti and Kumbha pradakshina were performed followed by Balalaya Samprokshana in Mesha Lagnam.  

Temple Deputy EO Smt. Shanti, AEO Sri. Munikrishna Reddy, one of the Chief Priests of Srivari Temple Sri Venugopala Deekshitulu, Vaikhanasa Agama Advisor Sri Sitaramacharyulu, Ritwiks and other officials participated in this program.

 ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అలిపిరి పాదాల మండ‌పం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌శ్వ‌మివారి ఆలయంలో పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసిన‌ బాలాల‌యం

తిరుపతి, 2025 మార్చి 03: తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద గ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయం, శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ గోదా అమ్మ‌వారి ఆల‌యంలో అష్ట‌బంధ‌నం కార‌ణంగా గ‌త మూడు రోజులుగా నిర్వ‌హిస్తున్న బాలాల‌యం కార్య‌క్ర‌మాలు సోమ‌వారం ఉద‌యం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి .

ఇందులో భాగంగా ఉదయం 8 గంట‌ల‌కు యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, కుంభ ప్ర‌ద‌క్ష‌ణ నిర్వ‌హించారు. ఉద‌యం 9.20 నుండి 9.55 గంట‌ల మ‌ధ్య మేష‌ ల‌గ్నంలో బాలాల‌య సంప్రోక్ష‌ణం నిర్వ‌హించారు. త‌దుప‌రి మ‌హా సంప్రోక్షణ నిర్వ‌హించే వ‌ర‌కు భ‌క్తులు బాలాల‌యంలో స్వామివారిని ద‌ర్శించుకోవ‌చ్చు.

గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్ర‌ప‌టాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరిగే వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ సీతారామాచార్యులు, రుత్వికులు, ఇత‌ర అదికారులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.