CHAIRMAN VISITS ALIPIRI PADALA MANDAPAM _ అలిపిరి పాదాల మండపంలోని శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు

SILVER ORNAMENTS DONATED

Tirupati, 04 January 2025: TTD Chairman Sri B. R. Naidu visited Sri Venkateswara Swamy at Alipiri Pada Mandapam on Saturday and performed special pujas.

On this occasion, the President of the United Andhra Pradesh Cable and TV Operators Association, Sri Prabhakar Reddy presented specially made silver sandals, silver crown, Varada Hastam, Kati Hastam and some other ornaments worth about Rs. 5 lakh to TTD through the hands of the Chairman to the presiding deity of Sri Padala Venkateswara Swamy.

TTD JEO (H & E) Smt. Goutami, temple priests and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అలిపిరి పాదాల మండపంలోని శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు

వెండి పాదుకలు, వెండి కిరిటం, వరద హస్తంను విరాళంగా అందించిన దాత

తిరుపతి 2025, జనవరి 04: అలిపిరి పాదాల మండపంలోని శ్రీవేంకటేశ్వర స్వామివారిని టీటీడీ చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేబుల్ టివి ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన
సుమారు రూ. 5 లక్షల విలువైన వెండి పాదుకలు, వెండి కిరిటం, వరద హస్తం, కఠి హస్తం మరికొన్ని అభరణాలను చైర్మన్ చేతుల మీదుగా టిటిడి కి విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీమతి ఎం.గౌతమి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది