MAHA SAMPROKSHANA AT ALIPIRI TEMPLE _ అలిపిరి శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు

Tirupati, 22 Nov. 20: The Astabandhana Balalaya Maha Samprokshana ritual at Sri Lakshmi Narayana Swamy temple in Alipiri will be observed on November 23 and 24.

As part of the two-day festive rituals, Panchagavyadhivasam was performed on Sunday morning at the yagashala of the temple. 

Later in the evening other vaidika programs were also conducted.

Meanwhile, on November 25 Homas, Maha Purnahuti, Kumbharchana and Vimana Samprokshana for Sri Lakshmi Narayana Swamy and his family of Gods will be performed.

Temple Spl. Gr.DyEO Sri Rajendrudu, Vaikhanasa Agama advisor, Sri Sundaravarada Bhattacharya, Kankana Bhattar Sri Murali Krishna Acharyulu, temple inspector Sri Srinivasulu were also present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

అలిపిరి శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు

తిరుప‌తి, 2020 న‌వంబ‌రు 22: తిరుప‌తి అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద గ‌ల శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం శాస్త్రోక్తంగా జ‌రుగుతున్నాయి. సోమ‌, మంగ‌ళ‌వారాల్లో యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మూల‌వ‌ర్ల‌కు పంచ గ‌వ్యాధివాసం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. 

కాగా సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఉక్త హోమాలు, వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.  

న‌వంబ‌రు 25వ తేదీ బుధ‌వారం ఉద‌యం 7.30 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హోమాలు, ఉద‌యం 9 నుండి 10.30 గంట‌ల మ‌ధ్య మ‌హా పూర్ణాహూతి,  ధ‌నుర్ ల‌గ్నంలో  శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ స్వామి, ప‌రివార దేవ‌త‌ల‌కు కుంభ‌ర్చాన, విమాన సంప్రొక్షణ జ‌రుగుతుంది.  

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు‌, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ సుంద‌ర‌వ‌ర‌ద భ‌ట్టాచార్యులు, కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ ముర‌ళి కృష్ణ ఆచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు, అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Text content