ASWA VAHANAM HELD _ అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
TIRUPATI, 24 JUNE 2024: Sri Prasanna Venkateswara donned Kalki Avatara on the divine horse carrier on Monday evening to bless His devotees.
With the lord taking ride Aswa Vahanam, the vahana sevas culminated on the penultimate day in the Navahnika Brahmotsavam at Appalayagunta.
DyEO Sri Govindarajan, AEO Sri Ramesh, Kankanabhattar Sri Suryakumaracharyulu, Superintendent Smt Srivani, temple inspector Sri Siva Kumar and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
తిరుపతి, 2024 జూన్ 24: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో సోమవారం రాత్రి కల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.
వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈఓ శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి వాణి, కంకణ భట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.