KALKI ON ASWA _ అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ క‌ల్యాణ‌ వేంకటేశ్వరస్వామి

TIRUPATI, 25 FEBRUARY 2025: The annual Brahmotsavam at Srinivasa Mangapuram on eighth evening witnessed the deity taking Kalki Avatara and riding Aswa vahanam.

Amidst the grand fare of colourful paraphernalia, dance forms by artists, the utsava deity paraded along the temple streets blessing His devotees atop the divine horse carrier.

Spl Gr DyEO Smt Varalakshmi and other temple staff were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ క‌ల్యాణ‌ వేంకటేశ్వరస్వామి

తిరుపతి, 2025 ఫిబ్రవరి 25: శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ‌ వేంకటేశ్వర‌స్వామి బ్రహ్మోత్సవాల్లోమంగ‌ళ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు.

వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.

వాహ‌న సేవ‌లో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌న శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.