ASWA VAHANA AT JUBILEE HILLS BTU _ అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ వేంకటేశ్వరస్వామి

Hyderabad/ Tirupati, March ch 05, 2025:  As part of the ongoing annual Brahmotsavams of Jubilee Hills Sri Venkateswara Swamy temple the Lord graced the devotees by riding  Aswa Vahana adorned with Kalki ornaments at 7 pm on Wednesday.

Amidst bhajans and kolatas before the Vahana Seva, the Lord’s festival was celebrated with great enthusiasm amidst the Mangal vadyams. Devotees offered camphor aartis at every step and had darshan of the Lord.

Temple AEO Sri Ramesh, other officials, and a large number of devotees participated in the vehicle service.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ వేంకటేశ్వరస్వామి

తిరుపతి, 2025 మార్చి 05: శ్రీకాళ‌హ‌స్తి మండ‌లం తొండ‌మాన్‌పురం గ్రామంలోని శ్రీదేవి, భూదేవి స‌మేత ప్ర‌స‌న్న అభ‌య‌హ‌స్త ఆసీన‌ శ్రీ వేంకటేశ్వర‌స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు.

వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్త నాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.

వాహ‌న సేవ‌లో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, సూపరింటెండెంట్ శ్రీ జ్ఞాన‌ప్ర‌కాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ ర‌వి కుమార్ రెడ్డి, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మార్చి 6న చ‌క్ర‌స్నానం

శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన గురువారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది.

ఇందులో భాగంగా ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం, చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వ‌హిస్తారు.

సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగియ‌నున్నాయి.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.