SOMASKANDA RIDES ASWA _ అశ్వ వాహనంపై సోమస్కందమూర్తి

Tirupati, 10 Mar. 21: Somaskandamurty accompanied by Kamakshi Ammavaru cheered devotees on Aswa Vahana. 

The divine horse carrier Seva was held on Wednesday evening as part of the ongoing annual brahmotsavams at Kapileswara Temple in Tirupati. 

In view of Covid guidelines, the vahana Seva was held in Ekantam. 

DyEO Sri Subramanyam and others were present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అశ్వ వాహనంపై సోమస్కందమూర్తి

తిరుపతి, 2021 మార్చి 10: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి అశ్వ వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. స్వామి అశ్వ వాహనాధిరూఢుడై తన స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామసంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.