ITS A DAY OF FOLK ART FORMS _ అశ్వ వాహన సేవలో భక్తులను విశేషంగా ఆకర్షించిన మట్కి, బంగ్రా కళా నృత్యాలు

TIRUMALA, 11 OCTOBER 2024: On the eighth evening, in front of Kalki Vahanam, an array of folk cultural forms were displayed which attracted the devout.

The famous folk arts including Keelu Gurram, Chekka Bhajans, Tribal dance, Pillanagrovi, Banjara, Lambadi, Gussadi, Kommu Koya, Kurala Kuravanji by the artistes AP and TS stunned the devotees.

While from other states, Valayattam,  Tiruvatta Kaali, Oriyadi, Patakuniya, Dolukunita, Chilipili Gumbe, Veeragasa stood impressive besides other art forms.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అశ్వ వాహన సేవలో భక్తులను విశేషంగా ఆకర్షించిన మట్కి, బంగ్రా కళా నృత్యాలు

తిరుమల, 2024 అక్టోబ‌రు 11: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం అశ్వ వాహన సేవలో టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుండి 20 కళా బృందాలు, 528 మంది కళాకారులు పాల్గొన్నారు.

తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వెంకట కృష్ణ బృందం ప్రదర్శించిన జానపద నృత్యం,శ్రీకాకుళానికి చెందిన వి.మనీష బృందం ప్రదర్శించిన పంజాబ్ బంగ్రా నృత్యం, తిరుపతికి చెందిన కార్తిక్ నాయక్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం విశేషంగా ఆకర్షించింది.

మదనపల్లికి చెందిన ఎల్. వెంకట రమణ బృందం ప్రదర్శించిన పిల్లనగ్రోవి నృత్యం, తమిళనాడుకు చెందిన తల్కావతి బృందం ప్రదర్శించిన భరతనాట్యం, రాజస్థానుకు చెందిన మయాంక్ తివారీ బృందం ప్రదర్శించిన దాండియా నృత్యం, రాజస్థానుకు చెందిన
రూప్ సింగ్ బృందం ప్రదర్శించిన మట్కి కళా విశేషం, మంత్రాలయంకు చెందిన వాజిరాజ్ బృందం ప్రదర్శించిన భజన సంకీర్తన, రాజమండ్రికి చెందిన రోహిణి కుమార్ బృందం ప్రదర్శించిన డప్పు విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎ.లక్ష్మీ బృందం ప్రదర్శించిన కోలాటం, రాయచోటికి చెందిన వై.మల్లిఖార్జున బృందం,
తిరుపతికి చెందిన ప్రసన్న కుమారి బృందం, తిరుమలకు చెందిన డి. శ్రీనివాసులు బృందం, కావలికి చెందిన పి.అలేక్య బృందాలు ప్రదర్శించిన కోలాటాలు తిరుపతికి చెందిన డాక్టర్ మురళీ కృష్ణ బృందం ప్రదర్శించిన దశావతారాలు రూపకం భక్తులును పరవసింపచేశాయి.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.