ఆగష్టు 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు శ్రీ ఆంజనేయస్వామివారి ఆల‌య మహాసంప్రోక్షణ              

ఆగష్టు 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు శ్రీ ఆంజనేయస్వామివారి ఆల‌య మహాసంప్రోక్షణ              

తిరుపతి, 2010 ఆగష్టు 11 : తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయానికి ఉపఆలయమైన శ్రీమటం ఆంజనేయస్వామి వారి ఆలయంలో ఈ నెల 14వ తేది నుండి 16వ తేది వరకు మహాసంప్రోక్షణ ఘనంగా జరుగుతుంది.
మూడురోజులపాటు జరిగే మహాసంప్రోక్షణ కార్యక్రమాలు క్రింది విధంగా ఉంటాయి.

14-08-2010  –   సాయంత్రం 6.30 గంట‌ల‌కు- అంకురార్పణం,యాగశాలవైదిక కార్యక్రమాలు, ఆంజనేయస్వామివారి చిత్రపటం ఊరేగింపు

15-08-2010
ఉదయం   8.30 – యాగశాలవైదిక కార్యక్రమాలు
సాయంత్రం 4.00 – మహాశాంతి అభిషేకం
సాయంత్రం 7.30 – యాగశాలవైదిక కార్యక్రమాలు

16-08-2010
ఉదయం 4.30 – యాగశాలవైదిక కార్యక్రమాలు
ఉదయం 6.30 – పూర్ణాహాతి, కుంబ ప్రదక్షణం
ఉదయం 7.10 – సంప్రోక్షణ, అర్చన నైవేద్యం

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.