GOKULASHTAMI CELEBRATIONS AT TIRUCNOOR SRI KRISHNASWAMY TEMPLE ON AUGUST 16 _ ఆగష్టు 16న తిరుచానూరు శ్రీ కృష్ణస్వామిఆలయంలో గోకులాష్టమి
Tirupati, 30 July 2025: Sri Krishnaswami Temple, the sub-temple in the Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor, will celebrate Gokulashtami on August 16 with traditional religious fervor.
In the morning, Abhishekam and Archana to the of Sri Krishnaswami. 3:00 PM – 4:00 PM: Snapana Tirumanjanam will be performed to the Utsava Murthys at the Mukha Mandapam. Evening: Unjal Seva will be conducted.
7:00 PM – 8:15 PM: The Lord will grace devotees on Pedda Sesha Vahanam, parading through the four Mada streets of the temple. 8:30 PM – 9:00 PM: Go Puja followed by Gokulashtami Asthanam will be held.
On the following day, August 17, Utlotsavam will be observed:
Evening 3:00 PM – 4:00 PM: Snapana Tirumanjanam and Unjal Seva, 6:15 PM – 7:30 PM: Utlotsavam and Asthanam for the deity
Due to these special events, the Sahasra Deepalankara Seva on August 16 stands cancelled, as per TTD.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగష్టు 16న తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో గోకులాష్టమి
– పెద్దశేష వాహనంపై శ్రీకృష్ణస్వామి కటాక్షం
తిరుపతి, 2025 జూలై 30 : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి ఆలయంలో ఆగష్టు 16వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
గోకులాష్టమి రోజున ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు. శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ జరుగనుంది. రాత్రి 7 నుండి 8.15 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి కటాక్షించనున్నారు.
అనంతరం రాత్రి 8.30 నుండి 9 గంటల వరకు గోపూజ, గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.
అదేవిధంగా ఆగష్టు 17న ఉట్లోత్సవంను పురస్కరించుకొని మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, తరువాత ఊంజల్‌సేవ జరుగనుంది. సాయంత్రం 6.15 నుండి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారికి ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.
ఈ కారణంగా ఆగష్టు 16న ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్ధు చేసింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
