AMARAVATHI TEMPLE PAVITROTSAVAMS _ ఆగష్టు 19 – 21 తేదీల్లో అమరావతిలోని ఎస్వీ ఆలయంలో పవిత్రోత్సవాలు

TIRUPATI, 13 AUGUST 2025: The three-day Pavitrotsavams in Sri Venkateswara Swamy temple at Amaravathi will be observed from August 19-21.

TTD has made elaborate arrangements to conduct the Pavithrotsavams from August 19 to 21 at the Sri Venkateswara Swamy Temple in Amaravati. This temple, located at Venkata Palem in the capital city of Andhra Pradesh, was constructed by TTD and consecrated for the public worship. 

For the first time, Pavithrotsavams is being conducted here as per the tenets of the Vaikhanasa Agama for the welfare of humanity.

On the evening of August 18, Ankurarpanam (the seed sowing ritual) will be performed.

On August 19, Panchagavya Aradhana, Akalmasha Homam, Vastu Puja, Vastu Homam, Snapana Tirumanjanam will be performed, followed by Yagashala Vaidika programmes, Pavitra Pratista Adhivasam, and Sarvadevata Homam in the evening.

On August 20, Punyahavachanam, Kumbha Aradhana, Pradhana Homams, Snapana Tirumanjanam, Pavitra Abhimantranam, and Pavitra Samarpanam will be held. In the evening, Yagashala Vaidika programmes, Maha Shanti Homam, and Thiruveedhi Utsavam will take place.

On August 21 morning, Punyahavachanam, Yagashala Vaidika programmes, Snapana Tirumanjanam, and in the evening, Purnahuti, Kumbha Pradakshinam, Kumbha Samarpanam, Vishesha Aradhana, presentation of honours to Acharyas, Agama Advisors, and Ritviks, followed by Yajamana Ashirvachanam will be conducted.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఆగష్టు 19 – 21 తేదీల్లో అమరావతిలోని ఎస్వీ ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2025, ఆగష్టు 13: అమరావతిలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఆగష్టు 19 – 21వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మహా నగరం అమరావతి ( వేంకటపాలెం)లో టిటిడిచే నిర్మింపబడి, కొలువుతీరి వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నుందు ప్రప్రథమంగా లోక కల్యాణార్థం, సర్వలోకహితార్థం శ్రీ వేఖానస భగవచ్ఛాస్త్రరీత్యా పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.

ఆగష్టు 18వ తేదీ సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణం జరుగనుంది. ఉదయం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విక్ వరణము, సేనాధిపతి ఉత్సవం, మృతస్సంగ్రహణం నిర్వహిస్తారు.

ఆగష్టు 19న ఉదయం పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట అధివాసం, సర్వదైవత్య హోమం చేపడుతారు.

ఆగష్టు 20న ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు, స్నపన తిరుమంజనం, పవిత్రాభిమంత్రణ, పవిత్ర సమర్పణము, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఆగష్టు 21వ తేదీన ఉదయం పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమములు, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, ఆచార్య, ఆగమ సలహాదారు, ఋత్విక్కులకు బహుమానం, యాజమాన ఆశీర్వాచనం చేపడుతారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబందాల అధికారిచే విడుదల చేయబడినది.