GOKULASTAMI CELEBRATIONS IN TIRUCHANOOR _ ఆగష్టు 27న తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో గోకులాష్టమి
Tirupati, 22 August 2024: On the occasion of Gokulastami on August 27, special pujas will be performed in Sri Krishna Swamy temple located in the Tiruchanoor temple complex.
The sub-shrine is located adjacent to Sri Padmavati Ammavaru temple.
On that day, special Abhishekam will be performed in Sri Krishna Mukha Mandapam followed by Pedda Sesha Vahanam in the evening.
On August 28, Utlotsavam will be observed in the evening.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగష్టు 27న తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో గోకులాష్టమి
– పెద్దశేష వాహనంపై శ్రీకృష్ణస్వామి కటాక్షం
తిరుపతి, 2024 ఆగస్టు 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి ఆలయంలో ఆగష్టు 27వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
గోకులాష్టమి రోజున ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు. శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ జరుగనుంది. రాత్రి 7 నుండి 8.15 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. అనంతరం రాత్రి 8.30 నుండి 9 గంటల వరకు గోపూజ, గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.
అదేవిధంగా ఆగష్టు 28న ఉట్లోత్సవంను పురస్కరించుకొని సాయంత్రం 5 గంటలకు శ్రీ కృష్ణస్వామివారికి ఊంజల్‌సేవ జరుగనుంది. సాయంత్రం 6.15 నుండి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారికి ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.
ఈ కారణంగా ఆగష్టు 27న ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్ధు చేసింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.