SPECIAL FESTIVALS IN KRT _ ఆగస్టు నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, July 27, 2025: Several special festivals will be observed at  Sri Kodandarama Swamy Temple in Tirupati in August. 

  On Saturdays of August 02, 09, 16, 23, 30, the abhishekam will be performed for the main deities of Sri Sita Rama and Lakshmana at 6 am. At 5.30 pm, the ceremonial idols of will be taken out along the four madha streets of the temple on Tiruchi.

  On August 09, on the occasion of the full moon, Ashtottara Kalasabhishekam will be performed to the Utsava idols of Sri Sita Rama and Lakshmana at 9.30 am, and the Tiruchi and Asthanam at Sri Ramachandra Pushkarini at 6.30 pm.

  Sri Krishnashtami Asthanam will be held on August 16.

  Utlotsavam will be held on August 18.

  Sri Sitarama Kalyanam will be held on August 20 at 11 am on the occasion of Punarvasu Nakshatra.  

  Sahasra Kalashabhishekam will be performed on August 23 at 9 am on the occasion of Amavasya. Hanumantha Vahana Seva will be performed at 7 pm.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2025 జూలై 27: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో న‌వంబరులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ఆల‌య నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చిపై ఊరేగిస్తారు.

 – ఆగస్టు 9వ  తేదీన పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్స‌వర్లకు అష్టోత్తర కలశాభిషేకం,  సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు.

  ఆగస్టు 16న శ్రీకృష్ణాష్టమి ఆస్థానం.

  ఆగస్టు 18న ఉట్లోత్సవం.

  ఆగస్టు 20న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది.  సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.      

  ఆగస్టు 23న అమావాస్య సందర్భంగా ఉదయం 9 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.