208TH DEATH ANNIVERSARY OF TARIGONDA VENGAMAMBA TO BE CELEBRATED ON AUGUST 1 AND AUGUST 2 _ ఆగస్టు 1, 2వ తేదీల్లో వెంగమాంబ 208వ వర్ధంతి ఉత్సవాలు
Tirupati, 29 July 2025: The 208th death anniversary of the great Saint-poetess Matrusri Tarigonda Vengamamba, an ardent devotee of Sri Venkateswara Swamy, will be observed with devotional fervor on August 1 and 2 at Tirupati, Tirumala, and in Tarigonda.
In Tirupati:
August 1:
At 9AM, devotional music programs by artists of the Annamacharya Project will be held at Annamacharya Kala Mandiram.
At 10AM, a literary seminar will be conducted on the works of Tarigonda Vengamamba.
At 6PM, cultural and musical programs will be presented.
August 2:
At 9AM, TTD officials will offer floral tributes at the statue of Tarigonda Vengamamba located at M.R. Palli Circle.
At 10:30 AM, a music concert will be held at Annamacharya Kala Mandiram.
At 11:30 AM, a Harikatha (spiritual storytelling) session will be organized.
At 6PM, a cultural program featuring prominent artists will take place.
In Tirumala:
August 2:
At 9 AM, senior officials of TTD will offer floral tributes at the Brindavan of Tarigonda Vengamamba in Tirumala.
In Tarigonda (Birthplace):
August 2:
At 5PM, Kalyanotsavam (celestial wedding) will be performed to Sri Lakshmi Narasimha Swamy at the temple in Tarigonda.
Devotional music performances will be presented by Annamacharya Project artists on this occasion.
ఆగస్టు 1, 2వ తేదీల్లో వెంగమాంబ 208వ వర్ధంతి ఉత్సవాలు
తిరుపతి, 2025 జూలై 29: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 1, 2వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి.
తిరుపతిలో…
తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 1వ తేదీన ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, ఉదయం 10 గంటలకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆగస్టు 2వ తేదీ ఉదయం 9 గంటలకు ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గంటలకు సంగీత కచేరి, ఉదయం 11.30 గంటలకు హరికథ, సాయంత్రం 6 గంటలకు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తిరుమలలో…
ఆగస్టు 2వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో టీటీడీ ఉన్నతాధికారులు పుష్పాంజలి సమర్పించనున్నారు.
తరిగొండలో…
వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు శ్రీలక్ష్మీనృసింహస్వామి వారికి కల్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
