FESTIVALS AND RELIGIOUS EVENTS IN SKVST _ ఆగస్టు 1, 31వ తేదీల్లో గరుడ వాహనంపై కటాక్షించునున్న శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
TIRUPATI, 30 JULY 2023: The following are the religious events and festivals lined up in the month of August in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram.
August 1, 31: Garuda Vahanam on the auspicious day of Pournami
August 11: Sri Rukmini Satyabhama Sameta Sri Kalyana Venkateswara will parade on Tiruchi in the advent of Rohini Star
August 14: Sri Sita Lakshmana sameta Sri Ramachandra procession on Tiruchi on the advent of Punarvasu star
August 29: Sri Bhu sameta Sri Kalyana Venkateswara procession on Tiruchi in the advent of Sravana star
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 1, 31వ తేదీల్లో గరుడ వాహనంపై కటాక్షించునున్న శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
తిరుపతి, 2023 జూలై 30: శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగస్టు నెలలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
– ఆగస్టు 1, 31వ తేదీల్లో సాయంత్రం స్వామివారు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
– ఆగస్టు 11వ తేదీ రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకొని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారు సాయంత్రం తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
– ఆగస్టు 14వ తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ సమేత
శ్రీ రామచంద్రమూర్తి తిరుచిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగనున్నారు.
– ఆగస్టు 29వ తేదీ శ్రావణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంటేశ్వరస్వామి సాయంత్రం తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు భక్తులను అనుగ్రహించునున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.