ఆగస్టు 10న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు
ఆగస్టు 10న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు
తిరుపతి, 2012 ఆగస్టు 8: కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 10వ తేదీ శుక్రవారం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అదేవిధంగా శనివారం ఉట్లోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శుక్రవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవర్లకు అష్టోత్తర శతకలశాభిషేకం ఘనంగా జరుగనుంది. సాయంత్రం ఆస్థానం, శయనమండపంలో ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటల నుండి 8.30 గంటల వరకు స్వామివారికి నృత్య నివేదన చేయనున్నారు. అలాగే శనివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి పంచాంగ శ్రవణం చేయనున్నారు. సాయంత్రం ఉట్లోత్సవం, శయనమండపంలో ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటల నుండి 8.30 గంటల వరకు స్వామివారికి నృత్య నివేదన చేయనున్నారు.
ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.