ఆగస్టు 17న వాచీలు టెండర్ కమ్ వేలం

ఆగస్టు 17న వాచీలు టెండర్ కమ్ వేలం

తిరుపతి, 2023 ఆగస్టు 08: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఆగస్టు 17న టెండర్ కమ్ వేలం వేయ‌నున్నారు. ఇందులో హెచ్ఎంటి, సీకో, సిటిజన్, టైమ్స్, సోని, టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి.

కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 14 లాట్లు వేలంలో ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయ వేళల్లో సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.