ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు మహతిలో  శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మికోపన్యాసాలు

ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు మహతిలో  శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మికోపన్యాసాలు

తిరుపతి, 2012 ఆగస్టు 16: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కల్యాణ వైభవం అనే అంశంపై ఆధ్యాత్మికోపన్యాసాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సీతా కల్యాణం, రుక్మిణీ కల్యాణం, పార్వతీ కల్యాణం అనే అంశాలపై ఉపన్యసించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు ఈ ఉపన్యాస కార్యక్రమం జరుగనుంది. హిందూ ధర్మప్రచారం కోసం తితిదే ప్రతినెలా ప్రముఖ పండితులతో ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. తిరుపతి నగరవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక చైతన్యం పొందాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.