GAYATRI JAPAM ON AUGUST 20 _ ఆగస్టు 20న శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి శ్రీ మలయప్పస్వామి
TIRUMALA, 19 AUGUST 2024: On the auspicious occasion of Gayatri Japam on August 20, Sri Malayappa will visit Sri Vikhanasa Sannidhi.
Every year, the next day after Vikhanasa Maharshi Jayanti, as a traditional practice, Srivaru along with Sridevi and Bhudevi visit Sri Vikhanasacharya Sannidhi after Sahasra Deepalankara Seva in the evening.
Sri Vikhansa Maharshi had prescribed all the religious practices and festivals in Tirumala temple as per the Vaikhasa Agama Shastra.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 20న శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి శ్రీ మలయప్పస్వామి
తిరుమల, 2024 ఆగస్టు 19: ఆగస్టు 20న గాయత్రి జపాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు మంగళవారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం ఉత్తర మాడ వీధిలో గల శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేయనున్నారు.
సోమవారం శ్రీ విఖనస మహర్షి జయంతి జరిగింది. ఆ మరుసటి రోజు స్వామి, అమ్మవార్లు శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా అక్కడ ఆస్థానం నిర్వహించి నివేదన చేపడతారు. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం నిత్యకైంకర్యాలు, సేవలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ వైఖానస ఆగమశాస్త్రాన్ని శ్రీ విఖనస మహర్షి రచించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.