SRI VARLAKSHMI VRATAM AT SRI TIRUCHANOOR ON AUGUST 25 _ ఆగస్టు 25న తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం
- ONLINE TICKTES FROM AUGUST 18
Tirupati,16 August 2023: The TTD plans to organise grand celebrations of Sri Varalakshmi Vratam at Sri Padmavati temple in Tiruchanoor on August 25 both in the modes of direct and virtual participation by devotees.
As part of the festivities, the sacred vratam will be performed at the Asthana Mandapam on Friday morning between 10am and 12noon. In the evening Goddess Padmavati will ride Swarna Ratham on the Mada streets to bless devotees which will be telecasted live on SVBC channel.
TTD will also issue 150 tickets online for direct participation on August 18 morning at 9am and similarly another 150 tickets will be issued at the Kunkumarchana counters at 9am on August 24. Each ticket is priced at ₹1000 with eligibility for two persons per ticket.
The Virtual ticket holders will be permitted Darshan of Sri Padmavati Ammavaru within 90 days from August 26 onwards.
In view of the celebrations, TTD has cancelled Abisekam,
Kalyanotsavam,Vastralankarana Seva, Abiseka anantara Darshan, Lakshmi puja, Unjal Seva, VIP Break Darshan and Veda Ashirvachanam Seva etc. on the day.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 25న తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం
– నేరుగా, వర్చువల్‌గా పాల్గొనే అవకాశం
– ఆగస్టు 18న ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ
తిరుపతి, 2023 అగస్టు 16: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతంఘనంగా నిర్వహించనున్నారు.
ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్రతాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
భక్తులు నేరుగా వ్రతంలో పాల్గొనేందుకు ఆగస్టు 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తారు. అదేవిధంగా ఆలయం వద్ద గల కుంకుమార్చన కౌంటర్‌లో ఆగస్టు 24 వ తేదీ ఉదయం 9 గంటలకు కరెంట్ బుకింగ్‌లో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000/- చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా ఆగస్టు 18న ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనుంది. వర్చువల్ టికెట్లు పొందిన భక్తులకు ఆగస్టు 26వ తేదీ నుండి 90 రోజులలోపు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
ఈ కారణంగా అభిషేకం, వస్త్రాలంకరణ సేవ, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల సేవ, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం సేవలను టీటీడీ రద్దు చేసింది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.