VINAYAKA CHAVITHI CELEBRATIONS AT SRI KAPILESWARA SWAMY TEMPLE ON AUGUST 27 _ ఆగస్టు 27న శ్రీ కపిలేశ్వరాలయంలో వినాయక చవితి వేడుకలు
Tirupati, August 23, 2025: The annual Vinayaka Chavithi festival will be observed with devotion and grandeur at Sri Kapileswara Swamy Temple in Tirupati on August 27. Special religious programs have been scheduled on this occasion.
The day will commence with Suprabhatam, followed by Abhishekam and Archana to the presiding deity, Sri Vinayaka Swamy. In the evening at 5:30 PM, Sri Vinayaka Swamy will bless devotees during the Grama Utsavam procession on Mushika Vahanam.
Celebrations at Second Ghat Road Temple
At the Sri Vinayaka Swamy temple located on the Second Ghat Road, special rituals will also be performed on the same day. From 8:00 AM to 9:00 AM, Abhishekam will be offered to the presiding deity, followed by Archana and special pujas.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 27న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి వేడుకలు
తిరుపతి, 2025 ఆగస్టు 23: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో ఆగస్టు 27న వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయక స్వామివారి మూలవర్లకు అభిషేకం, అర్చన చేపడతారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వినాయకస్వామివారికి మూషికవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు.
రెండో ఘాట్ రోడ్డులోని ఆలయంలో…
రెండో ఘాట్ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉదయం 8 నుండి 9 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
