PAVITROTSAVAMS IN TONDAMANADU _ ఆగస్టు 28 నుండి 30వ తేదీ వరకుతొండమనాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
TIRUPATI, 26 AUGUST 2023: The annual Pavitrotsvams in Sri Venkateswara Swamy temple of TTD at Tondamanadu will be observed between August 28 and 30.
Ankurarpanam for the event will be observed on August 27.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 28 నుండి 30వ తేదీ వరకుతొండమనాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2023 ఆగస్టు 26: తొండమనాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 28 నుండి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 27న సాయంత్రం 6 గంటలకు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇందులో భాగంగా ఆగస్టు 28న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఆగస్టు 29న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్టానార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 30న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపనతిరుమంజనం, చక్రస్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంతరం సాయంత్రం వీధి ఉత్సవం, నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.