75th DEATH ANNIVERSARY OF SRI VETURI PRABHAKARA SHASTRI ON AUGUST 29 _ ఆగ‌స్టు 29న శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 75వ వర్ధంతి

Tirupati, August 26, 2025: The 75th Death Anniversary of eminent scholar Sri Veturi Prabhakara Shastri will be observed on August 29 at the SVETA Bhavan premises in Tirupati.

On this occasion, at 10 AM, TTD officials will pay floral tributes to his life size Bronze statue situated in front of SVETA Bhavan in Tirupati.

Later, a memorial meeting is organized at the Annamacharya Kalamanadiram. 

Sri Veturi Prabhakara Shastry, remembered for bringing the great works of Saint Poet Sri Tallapaka Annamacharya into the limelight.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 29 శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 75 వర్ధంతి

తిరుపతి, 2025 ఆగ‌స్టు 26: శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 75వ వర్ధంతి ఆగ‌స్టు 29వ తేదీ తిరుపతిలోని శ్వేత భవనం ప్రాంగణంలో జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు శ్వేత భవనం ఎదుట గ‌ల ఆయన విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు.

అనంత‌రం అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి సంస్మరణ సభ నిర్వ‌హిస్తారు. మరుగున పడిన అన్నమయ్య సాహిత్యాన్ని శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి వెలుగులోకి తెచ్చారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.