ANNUAL PAVITROTSAVAMS IN KARVETINAGARAM _ ఆగస్టు 29, 30వ తేదీల్లో కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

TIRUPATI, 28 AUGUST 2024: The annual Pavitrotsavams in Sri Venugopala Swamy temple atvKarvetinagaram is scheduled on August 29 and 30.

On August 29, Rutwik Varanam, Mritsangrahanam, Ankurarpanam are performed.

While on August 30, after Tirumanjanam, Pavitra Samarpana and Tiruveedhi Utsavam are observed.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 29, 30వ తేదీల్లో కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

తిరుపతి, 2024 ఆగష్టు 28: కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 29, 30వ తేదీల్లో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఆగస్టు 29వ తేదీన ఉదయం ఆచార్య రుత్విక్‌వరణం, సాయంత్రం మృత్సంగ్రహణం, సేనాధిపతి తిరువీధి ఉత్సవం, పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 30వ తేదీన ఉదయం మూలవర్లకు తిరుమంజనం, పవిత్రాల సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.