VALMIKIPURAM TEMPLE CORONATION FETE FROM AUG 9 – 11 _ ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు

Tirupati, 04 August 2024: TTD is organising the Pattabhirama Swamy temple coronation Mahotsavam from August 9 to 11 with  Ankurarpanam fete on August 9.

On August 10,  Yagashala Puja and Snpana Tirumanjanam will be performed followed by Unjal seva in the eveningat 5 pm, Sri Sitarama Shanti Kalyanam at 6.30 pm and Hanumantha Vahanaseva at 8 pm.

On August 11, Yagashala Puja and Snapana Tirumanjanam will be performed followed by grand Sri Rama Pattabhishekam at 6pm. 

Later in the night the utsava idol of Sri Pattabhirama will ride on the Garuda Vahanam and bless the devotees.

Grihastas can participate in Sri Rama Pattabhishekam Arjita Seva by paying Rs.300/- and beget  Uttariyam,  blouse and Anna Prasadams.

On all these three days the artists of TTD HDPP and Annamacharya projects will perform Harikatha, bhajans and spiritual devotional programs 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు

తిరుపతి, 2024 ఆగస్టు 04: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 9న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మొదటిరోజు సేనాధిపతి ఉత్సవం జరుగనుంది.

ఆగస్టు 10వ తేదీన ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, 6.30 గంటలకు శ్రీ సీతారామ శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.

ఆగస్టు 11న ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌ సేవ, రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.

గృహస్తులు (ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఈ మూడు రోజుల పాటు టీటీడీ హిందూధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.