VIRTUAL VARALAKSHMI VRATAM AT TIRUCHANOORK ON AUGUST 20 _ ఆగ‌స్టు 20న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

–       ONLINE TICKETS OPENS UP FOR DEVOTEES

Tirupati, 5 August 2021: In view of the Covid Pandemic, TTD has decided to organise the sacred Vara Mahalakshmi Vratam at Sri Padmavati Ammavari temple in Tiruchanoor on August 20 via a virtual platform.

All devotees shall purchase tickets priced at Rs.1001/- in online through the TTD website www.tirupatibalaji.ap.gov.in and participate by witnessing the auspicious ritual live on the SVBC channel between 10 am and 12noon that takes place in Sri Krishna Mukha Mandapam. 

The special rituals of the Vratam will also be performed in Ekantha to both Mula Virat and the utsava idol of Ammavaru.

All devotees participating virtually will be dispatched Uttarium, blouse, Akshintalu, Kankanams and one dozen bangle as a divine Prasadam from Sri Padmavati Ammavaru through India posts to their respective residential addresses.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 20న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనే అవ‌కాశం
 
ఆన్‌లైన్‌లో అందుబాటులో టికెట్లు

తిరుపతి, 2021 ఆగ‌స్టు 05: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగ‌స్టు 20న వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా జరుగనుంది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో టిటిడి ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనేందుకు వీలుగా ఈ టికెట్ల‌ను టిటిడి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.

ఆగ‌స్టు 20న ఉద‌యం అమ్మ‌వారి మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు ఏకాంతంగా అభిషేకం చేస్తారు. ఉద‌యం 10 నుండి 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌కృష్ణ ముఖ మండ‌పంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం నిర్వ‌హిస్తారు. ఈ సేవ‌లో పాల్గొనే భ‌క్తుల‌కు ఉత్త‌రీయం, ర‌విక‌, కుంకుమ‌, అక్షింత‌లు, కంక‌ణాలు, డ‌జ‌ను గాజులు ప్ర‌సాదంగా ఇండియా పోస్ట‌ల్ ద్వారా గృహ‌స్తుల చిరునామాకు పంప‌డం జ‌రుగుతుంది. పోస్ట‌ల్ ఛార్జీతో క‌లిపి ఈ సేవా టికెట్ ధ‌ర‌ను రూ.1001/-గా నిర్ణ‌యించారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా వ‌ర్చువ‌ల్ టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.